కాక్రోచ్ జనతా పార్టీ ఖాతా నిలిపివేత.. కేంద్రానికి, ఎక్స్ సంస్థకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
- కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ ఖాతా నిలిపివేత
- ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే
- తక్షణమే ఎక్స్ ఖాతాను పునరుద్ధరించాలన్న విన్నపాన్ని తిరస్కరించిన హైకోర్టు
మన దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ తాజా సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే. పెద్ద సంఖ్యలో యువత, సెలబ్రిటీలు ఈ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. మరోవైపు, ఈ పార్టీ ఎక్స్ ఖాతాను ఇండియాలో నిలిపి వేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఎక్స్ ఖాతాను నిలిపివేయడంపై కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఎలాంటి కారణం లేకుండానే తమ పార్టీ ఖాతాను ఎక్స్ నిలిపి వేసిందంటూ ఆయన పిటిషన్ వేశారు.
ఈ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ పురుషైంద్ర కుమార్ కౌరవ్ ధర్మాసనం పిటిషన్ ను విచారించింది. ఈ సందర్భంగా అభిజిత్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ... ఎక్స్ ఖాతా నిలిపివేయడం ద్వారా పార్టీ కార్యకలాపాలు, ప్రజలతో సంబంధాలు దెబ్బతింటున్నాయని కోర్టుకు తెలిపారు. వెంటనే పార్టీ ఎక్స్ ఖాతాను పునరుద్ధరించాలని కోరారు.
ఈ వాదనలపై కోర్టు స్పందిస్తూ... తక్షణమే ఎక్స్ ఖాతాను పునరుద్ధరించాలన్న విన్నపాన్ని తిరస్కరించింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వానికి, ఎక్స్ సంస్థకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 7వ తేదీకి వాయిదా వేసింది. తదుపరి విచారణలోగా కేంద్ర ప్రభుత్వం, ఎక్స్ సంస్థ తమ సమాధానాలను సమర్పించాలని ఢిల్లీ హైకోర్టు సూచించింది.